ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1995 నాటి సీఎంను మళ్లి చూస్తారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు తగ్గట్లుగానే పాలనలో కొత్త శకానికి నాంది పలుకుతున్నారు. నిర్ణయాల్లో వేగం పెంచారు. మారిన తన వ్యవహారశైలిని చాటేందుకు రెండు రోజుల కలెక్టర్ల సదస్సును ఒక్కరోజుకే పరిమితం చేశారు. గంటల కొద్దీ చర్చలు శని, ఆదివారాల్లో అధికారులతో సమావేశాలు వంటి వాటికి చెక్ పెట్టి ప్రజలను కలిసి వారి వినతుల పరిష్కారినికే ప్రాధాన్యం ఇస్తున్నారు.