• 7 years ago
yaddanapudi sulochana rani is no more. She at the age of 79 in california

మహిళా రచయితల్లో యద్దనపూడి సులోచనారాణిని(79) లెజెండ్ గా అభివర్ణించవచ్చు. అమెరికాలో నివాసం ఉంటున్న ఆమె కాలిఫోర్నియాలో మృతి చెందారు. గుండెపోటు రావడంతో సులోచనారాణి మృతిచెందినట్లు ఆమె కుటుంబ వర్గాలు ధృవీకరించాయి. నవలా రచయితగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఆమె మృతి చెందడంతో ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఎమెస్కో పబ్లిషర్ విజయ్ కుమార్ సులోచన దేవి అత్యధిక నవలలని ప్రచురించారు. సులోచన దేవి మృతి చెందిన విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు తనకు ఫోన్ చేసిన చెప్పినట్లు విజయ్ కుమార్ తెలిపారు.
యద్దనపూడి సులోచనారాణి కృష్ణా జిల్లాలోని మొవ్వ మండలం కాజా గ్రామంలో 1940లో జన్మించారు. కుటుంబ బంధాలు అద్భుతంగా ఆవిష్కరించే నవలా రచయిత్రిగా 'నవలా దేశపు రాణి'గా ఆమె కీర్త పొందారు.
సులోచనారాణి నవలలు వెండి తెరని కూడా ఓ కుదుపు కుదిపేశాయి. ఆమె రాసిన అనేక నవలలు సినిమాలుగా, టివి సీరియల్స్ గా అలరించాయి. అగ్నిపూలు, ఆహుతి, అమర హృదయం, రుతువులు నవ్వాయి, కలల కౌగిలి, ప్రేమ పీఠం, బహుమతి, బంగారు కలలు, మౌనతరంగాలు, మీనా వంటి నవలలు వెండి తెరపై మెరుపులు మెరిపించాయి.
1973 లో విజయనిర్మల, కృష్ణ నటించిన మీనా చిత్ర కథ సులోచనారాణి మీనా నవలనుంచి తీసుకున్నారు. మీనా నవల అత్యంత ప్రజాదరణ పొందింది. మీనా చిత్రం కూడా మంచి విజయం సాధించింది. 2016 లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకేకించిన అ.. ఆ చిత్రానికి కూడా మీనా నవలే ఆధారం.

Recommended