Manchu Manoj comment on joining Janasena:రాజకీయ పార్టీలో చేరే విషయం గురించి సినీ నటుడు మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మనోజ్ జనసేన పార్టీలో చేరనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంలో ఆయన ఆళ్లగడ్డలో చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్ని చేకూర్చే విధంగా ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా అందరిలో ఆసక్తి నెలకొంది.