Vijayawada as Tourist Destination: అమరావతికి గేట్వేగా ఉన్న విజయవాడను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య, పర్యాటక కేంద్రంగా విరాజిల్లిన విజయవాడకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. కృష్ణా తీరంలోని బెజవాడ నగరాన్ని వివిధ రంగాల సమగ్ర అభివృద్ధితోనూ పరుగులు తీయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొన్నేళ్లుగా కుంటుపడిన ప్రగతిని మళ్లీ పట్టాలపైకి ఎక్కించేందుకు అన్ని వర్గాల ప్రజలను భాగస్వాముల్ని చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం విస్తృత కసరత్తు చేస్తోంది.