LAND ACQUISITION FOR AMARAVATI: రాజధాని అమరావతి కోసం రెండో దశ భూసమీకరణకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధంచేస్తోంది. ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా రెండు వేల ఎకరాలే మిగులుతుండటం, ఇదే సమయంలో భూముల కోసం వివిధ సంస్థల నుంచి వినతులు పెరుగుతుండటంతో భూసమీకరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాజధాని సమీపంలోని గ్రామాల రైతులు భూ సమీకరణలో భూములిచ్చేందుకు ఆసక్తికనబరుస్తుండటంతో, ఆయా గ్రామాల నుంచి ప్రారంభించేందుకు CRDA సిద్ధమవుతోంది.