Venkaiah Naidu on Free Schemes : అప్పులు తీర్చే మార్గాలు చూపకపోతే కొత్తగా రుణాలు ఇవ్వని పరిస్థితి రావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. అన్నీ ఫ్రీ ఫ్రీ అంటూ ఓట్ల కోసం జనాన్ని ఆకట్టుకుంటున్నారని చెప్పారు. జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితికి తెలుగు రాష్ట్రాలను తెచ్చారని పేర్కొన్నారు. అప్పులు అనేవి ఫ్రీగా రావనే వాస్తవాన్ని పాలకులు గుర్తించాలన్నారు. విజయవాడలో ఒకే దేశం-ఒకే ఎన్నిక ప్రాముఖ్యత, సవాళ్లు, ప్రభావంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.