Solar fencing around Golden Gopuram At Yadadri Temple : తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగురిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఐదంతస్థుల స్వర్ణ దివ్య విమానం సంరక్షణకు ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం సోలార్ ఫెన్సింగ్‌తో భద్రతను కట్టుదిట్టం చేశారు. కోతులు, చోర భయం లేకుండా, దాత ఆర్థిక సాయంతో ఫెన్సింగ్ ఏర్పాట్లను చేపట్టినట్లుగా ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు.