Artificial Limbs For Dogs Visakha : విశాఖ మెడ్‌టెక్ జోన్ మరో ఘనత సొంతం చేసుకుంది. పెంపుడు జంతువులు ప్రమాదవశాత్తు కాళ్లు కోల్పోతే వాటికి తిరిగి కొత్త జీవితం ప్రసాదిస్తోంది. మెడ్‌టెక్ జోన్ కృత్రిమ అవయవాల విభాగంలో వాటికి కృత్రిమ కాలు అమర్చుతోంది. తాజాగా భైరవ అనే శునకానికి ఆర్టిఫిషియల్ లింబ్‌ను అమర్చి కొత్త చరిత్ర లిఖించింది. అది ఓ ప్రమాదంలో ఒక కాలు కోల్పొయింది. దానికి ఆర్టిఫిషియల్ లింబ్ అమర్చాలని శునకం యజమాని మెడ్‌టెక్ జోన్‌లోని కృత్రిమ అవయవాల విభాగాన్ని అభ్యర్థించారు.