తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. కరవు పరిస్థితులు నెలకొన్నప్పుడు భక్తుల అవసరాలకు సరిపడా నీరు అందించడం సమస్యగా మారుతోంది. ఈ క్రమంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ఉన్న జలాశయాలను జలవనరుల శాఖ పరిధిలోకి తేవడంతో పాటు నిల్వ సామర్థ్యం పెంచేందుకు కసరత్తు చేస్తోంది.