Amaravati Brand Ambassadors : అమరావతిని మరింత ప్రమోట్ చేసేలా బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రంగాల్లో నిపుణులు, రాజధాని ప్రాంతంలో ప్రజల్లో మమేకమైన వారినే ఇందుకు నియమించనున్నారు. సుస్థిరత, అభివృద్ధి, ఆవిష్కరణ, సామాజిక స్థితి అనే అంశాల ప్రాతిపదికన వారిని ఎంపిక చేయనున్నారు. నామినేషన్ ప్రాతిపదికన బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకోవాలని సర్కార్ భావిస్తోంది. ముఖ్యమంత్రి లేదా సీఎం కార్యాలయం నామినేట్ చేసిన వారినే ఎంపిక చేయనున్నారు.