CM Chandrababu Attended Iftar Dinner at Vijayawada : నూటికి నూరుశాతం పేదల్ని పైకి తీసుకొచ్చేందుకే ఈనెల 30న పీ4 అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలతో తానుండాలనేదే తన జీవితాశయం అని వెల్లడించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతీ పేదవాడిని పైకి తీసుకొచ్చే కార్యక్రమమే పీ4 అని వివరించారు. పేదరికంలో ఉన్న ప్రతీ ముస్లిం కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చి తీరుతామన్నారు. అలాగే వక్ఫ్ బోర్డు ఆస్తులని కాపాడతామని హామీ ఇచ్చారు.