Minister Lokesh on Andhra University Ex VC Frauds : విశ్వవిద్యాలయాల్లో మళ్లీ తప్పు చేయాలంటేనే భయపడేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు. ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాదరెడ్డి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై 60 రోజుల్లో విజిలెన్స్ విచారణ పూర్తిచేసి, కఠినమైన చర్యలు తీసుకుంటామని లోకేశ్ చెప్పారు. ప్రసాదరెడ్డి అవినీతి, అక్రమాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణ, గణబాబు, విష్ణుకుమార్ రాజు, కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నలపై మంత్రి లోకేశ్ సమాధానమిచ్చారు.