Petition to Home Minister Anita In Anakapalli District : జగన్ పాలనలో హత్యలకు, దాడులకు గురైన దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని హోం మంత్రి వంగలపూడి అనితకు విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక (విదసం) విజ్ఞప్తి చేసింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలోని హోం మంత్రి నివాసంలో శనివారం ఆమెను కలిశారు. వేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకటరావు ఆధ్వర్యంలో కోడికత్తి శ్రీను, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, విశాఖపట్నం కేంద్ర కారాగారంలో మృతి చెందిన రిమాండ్ ఖైదీ ఉప్పాడ గౌరీశంకర్, వెంకటాయపాలెం శిరోముండనం బాధిత కుటుంబసభ్యులు వినతిపత్రం అందజేశారు.