Minister Nimmala On Polavaram Project Victims in Legislative Council : పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేసినట్లే, నిర్వాసితులను సైతం జగన్ నిలువునా ముంచేశాడని మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో ఒక్క రూపాయి నష్టపరిహారం గానీ, కాలనీల నిర్మాణానికి అరబస్తా సిమెంట్ పనులు గానీ చేయలేదని శాసనమండలిలో మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. గత ఐదేళ్లు నిర్వాసితులను పట్టించుకోకపోవడంతో తమను తెలంగాణలో కలిపేయమని నిర్వాసితులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారని గుర్తుచేశారు. నాడు 2017లో రూ.800 కోట్లు జమ చేసిన చంద్రబాబు, మళ్లీ ఏడేళ్ల తరువాత నిర్వాసితుల కష్టాలు తీర్చేలా నిర్వాసితులకు సంక్రాంతి కానుక అందించారని తెలిపారు.