Home Minister Vangalapudi Anitha Comments: వైఎస్సార్సీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, తప్పకుండా సంస్కరణలు తీసుకొస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. గత ఐదేళ్లు ప్రతిపక్ష నేతలను వేధించడానికే పోలీసులను వినియోగించారన్నారు. కొత్త ప్రభుత్వంలో మళ్లీ పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేస్తామన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హెచ్చరించారు.