Home Minister Anitha Review Meeting on Shakti App : మహిళల రక్షణ, భద్రతే లక్ష్యంగా శక్తి యాప్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆమె శక్తి యాప్‌పై సమీక్ష నిర్వహించారు. శక్తి యాప్‌ను ఇప్పటికే చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. దీన్ని మరింత సులువుగా, మెరుగైన సేవలు అందించేలా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు. యాప్‌పై అనేక మంది రకరకాలుగా మాట్లాడుతున్నారని దాని గురించి పట్టించుకోమన్న ఆమె మహిళల భద్రతే తమకు ప్రధానమని స్పష్టం చేశారు.