Telangana CM Revanth Reddy on Online Betting APPs in Assembly Sessions : బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ తరుణంలో ఆన్లైన్ బెట్టింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గేమింగ్, రమ్మీ కేసులు, చర్యలకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్లైన్ బెట్టింగ్‌పై సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.