Skip to playerSkip to main contentSkip to footer
  • 5/12/2025
Gautam Sawang on APPSC Scam : ఏపీపీఎస్సీ స్కాంలో తాడేపల్లి పెద్దలతో సహ మాజీ ఛైర్మన్‌ గౌతమ్ సవాంగ్ హస్తం ఉందని బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. ఆయన ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు. ఏపీపీఎస్సీకి ఛైర్మన్​గా గౌతమ్ సవాంగ్ కోర్టుకు అన్ని అబద్ధాలు చెప్పారని విమర్శించారు. తప్పుడు సంస్థకు కాంట్రాక్టు ఇచ్చి అభ్యర్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో ప్రొఫెసర్ ఉదయభాస్కర్​ను ఏపీపీఎస్సీ ఛైర్మన్​గా నియమించారనే కక్ష పట్టారని మండిపడ్డారు. హాయ్ ల్యాండ్ రిసార్ట్ వేదికగా గ్రూప్-1 పేపర్లు దిద్దే కార్యక్రమం చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎస్ఆర్ ఆంజనేయులుతో పాటు గౌతమ్ సవాంగ్ కూడా శిక్షార్హుడే అని చెప్పారు.

Category

🗞
News

Recommended