Lokesh on DSC Notification : రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు 1998 డీఎస్సీకి సంబంధించిన అంశంపై ప్రశ్నించారు. పలువురు శాసన సభ్యలు దీనిపై ప్రశ్నలు లేవనెత్తారు. వీటికి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. ఇటీవలే 16,000 పైచిలుకు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ ప్రకటించామని తెలిపారు. న్యాయవివాదాల పరిష్కారం తర్వాత త్వరలోనే డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని లోకేశ్ వెల్లడించారు.