Father and Son Achieved Ranks in DSC 2024 : మూడుసార్లు డీఎస్సీ పరీక్షలు రాశాడు. ప్రతిసారీ స్వల్ప మార్కుల తేడాతో ఉద్యోగం పొందే అవకాశం కోల్పోయాడు. వరుస వైఫల్యాలు ఎదురైనా కుంగిపోలేదు. వయసు మీద పడుతున్నా అధైర్యపడలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయున్ని కావాలన్న లక్ష్యాన్ని వీడలేదు. వయో పరిమితి సడలింపును అవకాశంగా మలచుకున్నాడు. డీఎస్సీకి శక్తినంతా కూడదీసుకుని సన్నద్ధమయ్యాడు. చివరకు 50 ఏళ్ల వయసులో, ఆఖరి ప్రయత్నంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని దక్కించుకున్నాడు. తాను చివరి ప్రయత్నంలో సర్కారీ నౌకరీ సంపాదిస్తే, అతని పెద్ద కుమారుడు ఇదే డీఎస్సీలో మొదటి ప్రయత్నంలోనే కొలువు కొల్లగొట్టాడు. తండ్రి, కుమారులిద్దరే కాదు కుటుంబం మొత్తం ప్రభుత్వ ఉద్యోగులే. కటిక పేదరికం నుంచి అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఎదిగిన ఆ కుటుంబంపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.