CM CBN on NITI Aayog Report: నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఏపీ డెబిట్ సస్టెయినబిలిటీలో సున్నా స్థాయిలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. జగన్ ప్రభుత్వంలో అప్పుల కోసం విశాఖలో ఎమ్మార్వో కార్యాలయం కూడా తాకట్టు పెట్టారని విమర్శించారు. నీతి ఆయోగ్ దేశంలోని అన్ని రాష్ట్రాల కోసం రూపుందించిన నివేదికలో ఏపీ అట్టడుగు స్థానంలో ఉందన్నారు. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టుపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. స్టేట్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్-2025 నివేదికపైనా చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు.