Vigilance Report On Medigadda : మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు విషయంలో ఇటు గుత్తేదారు సంస్థ, అటు నీటి పారుదల శాఖ రెండూ ఉదాసీనంగా వ్యవహరించాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆక్షేపించింది. ఈ మేరకు కాళేశ్వరం ఆనకట్టల నిర్మాణంలో అడుగడుగునా లోపాలను ఎత్తిచూపుతూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు మధ్యంతర నివేదిక సమర్పించింది. బ్యారేజీ నిర్మాణ వైఫల్యంపై పూర్తి నిర్ధారణ కోసం నిపుణుల కమిటీ వేయాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సూచించింది.