Home Minister Anitha on Together for Womens Protection : ప్రేమ అనే ముసుగులో యువత బలైపోతున్నారని ఆవేశంలో చేసిన తప్పులకు జైలుపాలు అవుతున్నారని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. విశాఖలో ‘మహిళా రక్షణకు కలసికట్టుగా’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. పోక్సో కేసుల్లో 20 శాతం మంది నిందితులు 20 ఏళ్ల లోపు వాళ్లే ఉంటున్నారన్నారు. 18 ఏళ్లలోపు వాళ్లు 60 శాతం మంది ఉంటున్నారని చెప్పారు. అన్ని విద్యాలయాల్లో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.