Amravati Ring Road Project: అమరావతితో పాటు ఏపీ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన, రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు కీలకమైన అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పించడం రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రాన్నే మార్చే పరిణామంగా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు సాకారమైతే అమరావతి నుంచి ఓఆర్ఆర్ వరకు భూములు బంగారమవుతాయని విస్తృత ఆర్థిక కార్యకలాపాలకు ఈ ప్రాంతం కేంద్రమవుతుందన్న భావన అంతటా వ్యక్తమవుతోంది. ఓఆర్ఆర్కు వెలుపలా కొన్ని కిలోమీటర్ల మేర ఈ ప్రభావం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది.