YSRCP Councillors Conflict in Rayadurgam : అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ సమావేశంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు రెండు వర్గలుగా విడిపోయి ఒకరినొకరు దూషించుకున్నారు. దీంతో భేటీ కాస్తా రసాభాసగా మారింది. కౌన్సిల్ సాధారణ సమావేశానికి 16 మంది సభ్యులు హాజరయ్యారు. అయినా సమావేశాన్ని కొనసాగించడంపై వైఎస్సార్సీపీ కౌన్సిలర్ బండి అజయ్ అభ్యంతర వ్యక్తం చేశారు.