YSRCP Leaders Occupied Kalakshetram: గుడివాడలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, కవులను తీర్చిదిద్దిన రామస్వామిచౌదరి కళా క్షేత్రంపై కొడాలి నాని అండతో ఆయన అనుచరులు కబ్జా చేశారు. వ్యాపార కార్యకలాపాల పేరుతో కోట్ల రూపాయల విలువైన ఆస్తిని వారి ఆధీనంలో ఉంచుకుని పెత్తనం చెలాయిస్తున్నారు. కళాకేంద్రం స్థలం విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఈ స్థలం విలువ 25 కోట్లకుపైనే ఉంటుంది.