Irrigation Societies Election in Joint Krishna District : సుదీర్ఘ కాలం తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల హడావుడి మొదలైంది. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ సర్కార్ సాగునీటి సంఘాల ఎన్నికల ఊసే ఎత్తలేదు. కూటమి సర్కార్ ప్రస్తుతం నీటి వినియోగదారుల సంఘాలు, పంపిణీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో సందడిగా మారింది. నీటి వినియోగదారుల సంఘాలు ఏర్పాటైతే సాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టే వీలుంటుంది. మరో వైపు ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ ఎన్నికల తర్వాత రాష్ట్ర స్థాయి అపెక్స్ కమిటీకి ప్రాధాన్యం సంతరించుకోనుంది.