CRDA Range Reduced in During YSRCP Govt: అమరావతిపై కక్షగట్టి మరీ జగన్ సర్కార్ కుదించిన సీఆర్డీఏ పరిధిని పునరుద్ధరించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. గత ఐదేళ్లలో ఏకంగా 1,610 చదరపు కిలో మీటర్ల రాజధాని ప్రాంతాన్ని జగన్ కోత కోశారు. ఈ ప్రభావం రాజధానిపై తీవ్రంగా పడింది. జగన్ చేసిన విధ్వంసం నుంచి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థను యథాపూర్వ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి వస్తోంది.