Panchumarthi Anuradha Counter to Jagan : రాష్ట్రంలో యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఏపీ ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులతో, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తెలిపారు. అయితే ఇది చూసి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తట్టుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో ఫేక్ డీఎస్సీ పోస్టుల పేరిట తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఉపాధ్యాయుల భర్తీ జరిగిందంటే దాని పేటెంట్ రైట్ కేవలం టీడీపీకే దక్కుతుందని తేల్చిచెప్పారు. మొత్తం 1.96 లక్షల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు అని గుర్తుచేశారు.