Dokka Vara Prasad Fire on Jagan : దేశాన్ని దోచుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీలా రాష్ట్రాన్నిజగన్ దోచుకున్నారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గుంటూరులో ముందస్తు క్రిస్ మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. క్రైస్తవం చెప్పి రాష్ట్ర ప్రజలను జగన్ మోసం చేశారని ఆరోపించారు. గత ఐదేళ్ల కాలంలో క్రైస్తవుల కోసం ఒక రూపాయి కూడా ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు. ప్రజలను దోచుకునే జగన్ క్రైస్తవాన్ని కాకుండా క్రైస్తవులంతా మదర్ థెరిస్సా, సర్ ఆర్ధన్ కాటన్ చూపిన సేవాగుణాన్ని అనుసరించాలని సూచించారు. గుంటూరులో ఉన్న క్రిస్టియన్ బిల్డింగ్ టీడీపీ ప్రభుత్వంలో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందని, గత ప్రభుత్వం అంబేద్కర్ భవన్, అలాగే క్రైస్తవ స్మశాన వాటికకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.