Congress Leader Tulasi Reddy Fire on YSRCP Leaders : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి డబ్బు పిచ్చి, అధికార పిచ్చి ఉన్నాయని, వాటికోసం ఎంతకైనా దిగజారుతాడని, ఏ దుర్మార్గానికైనా పాల్పడుతాడని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. ఆస్తికోసం నవమాసాలు మోసిన కన్న తల్లి మీదనే కోర్టు కెక్కాడని, ఎంతటి దూర్మార్గానికైనా పాల్పాడుతాడు అనేందుకు ఇది ఒక మచ్చు తునకని అన్నారు. జగన్కు తల్లి లేదు, చెల్లి లేదు, నాన్నలేడు, చిన్నాన్న లేడు,హితులు లేరు, సన్నిహితులు లేరని, ఉన్నదల్లా స్వార్థమే. అణువణువునా స్వార్థమే అని వెల్లడించారు. జగన్ ఇటువంటి వాళ్ళు సమాజానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదమని, ప్రజలు ఆలోచించాలన్నారు.