Fight Between YSRCP and TDP Groups in AP : పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం ఎడ్వర్డ్పేటలో వైఎస్సార్సీపీ- టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఇరు వర్గాల వారు రాళ్లు, గొడ్డళ్లు, ఇనుపరాడ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారుకు దారి ఇచ్చే విషయంలో వైఎస్సార్సీపీ- టీడీపీ వర్గీయుల మధ్య గొడవ జరిగింది. గాయాలైన వారిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు బాధితులను పరామర్శించారు.