KTR Focus On Hydra Musi : హైడ్రా, మూసీ ప్రాజెక్టుల విషయమై తదుపరి కార్యాచరణపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్లో జరుగుతున్న సమావేశంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ చర్యలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు, ప్రజల ఇబ్బందులపై సమావేశంలో చర్చిస్తున్నారు. అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పరంగా అనుసరించాల్సిన కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు.