BRS Leader KTR on HYDRA : "వందరోజుల్లోనే హామీలన్నీ నెరవేరుస్తామని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. వందరోజుల్లో చేస్తామన్న పనులను 300 రోజులు దాటినా చేయడం లేదు. ఇప్పటివరకు ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు. మూసీ పరివాహక ప్రజల పాలిట సీఎం రేవంత్ రెడ్డి కాలయముడిగా మారారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మాకు పట్టాలు వచ్చాయని ప్రజలు చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు చెప్తున్నారని పేదలు అడుగుతున్నారు." అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.