Hydra Excavations At Bathukamma Kunta In Amberpet : హైదరాబాద్ నగరంలో చెరువుల పునరుద్ధరణకు నడుం బిగించిన హైడ్రా ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసింది. అంబర్‌పేటలోని బతుకమ్మకుంటలో పునరుద్దరణ పనులను హైడ్రా మొదలుపెట్టగా మోకాలిలోతు తవ్వగానే నీరు ఉబికివచ్చింది. దీంతో హైడ్రా అధికారులతోపాటు స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బతుకమ్మకుంట మళ్లీ ప్రాణం పోసుకుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ పుష్పాలతో స్వాగతించారు. హైడ్రా తవ్వకాల్లో పైపులైన్ పగలడం వల్లే నీరు బయటికి వస్తోందని ప్రచారం జరిగింది. దీంతో జలమండలి అధికారులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఆ స్థలాన్ని పరిశీలించారు. ఎలాంటి పైపులైన్ లేదని, పూర్తిగా భూగర్భంలో నుంచి వచ్చిన నీళ్లేనని జలమండలి అధికారులు స్పష్టం చేశారు.