విద్యుత్ అనేది రాష్ట్ర అభివృద్ధితో ముడిపడిన అంశమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను కలిసినట్లు చెప్పారు. 300 యూనిట్లు దాటితే ప్రస్తుతం యూనిట్‌కు రూ.10 ఫిక్స్డ్ ఛార్జీ వసూలు చేస్తున్నారని, ఆ పరిధి దాటితే ప్రస్తుతం ఉన్నదానికంటే 5 రెట్లు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని అన్నారు. ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను కోరినట్లు తెలిపారు.