ANARCHY IN AP MINING DEPARTMENT: వైఎస్సార్సీపీ హయాంలో గనుల శాఖని శాసిస్తూ లీజుదారులను నానా ఇబ్బందులు పెట్టిన పెద్ద రెడ్డి అరాచకాల గుట్టు విప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు గత ఐదేళ్లూ పాత లీజుదారుల్లో ఎవరెవరిని ఎలా వేధించారు? లీజులు ఎలా చేతులు మారాయి? కొత్తగా ఎవరికి దక్కాయో? అనే వివరాలపై నివేదిక ఇవ్వాలని గనుల శాఖను ఆదేశించింది.