Swimming Champion in AP : స్నేహితులతో కలిసి సరదాగా నేర్చుకున్న ఈతనే కెరీర్‌గా ఎంచుకున్నాడు ఆ యువకుడు. సరైన ప్రోత్సాహం, సదుపాయాలు లేకున్నా పట్టుదలతో సాధన చేశాడు. ఆర్థిక పరిస్థితులు సహకరించకున్నా పోటీల్లో పాల్గొన్నాడు. స్విమ్మింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి ఏకంగా 18 పసిడి పతకాలు సాధించాడు ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాసరావు. ఆ పేదింటి క్రీడారత్నం కథ ఇది.