YSRCP VALLABHANENI VAMSI ANARCHY: గత ఐదేళ్లు వల్లభనేని వంశీ సాగించిన అరాచకాలకు వందల మంది బలయ్యారు. వంశీ, అతని అనుచరులు సాగించిన దాష్టీకాలకు గన్నవరం నియోజకవర్గంలో పనిచేసిన కొందరు పోలీసు అధికారులు పూర్తి అండదండలందించి తమ విధేయతను చాటుకున్నారు. ప్రత్యర్థులపై అక్రమ కేసులు, వేధింపులు, బెదిరింపులకు పాల్పడటం, వంశీ అనచురులు ఎన్ని దాడులకు పాల్పడినా వారిపై ఈగ వాలనివ్వకుండా కాపలాదార్లుగా కొందరు సిబ్బంది మారిపోయారనే విమర్శలు ఉన్నాయి.