KTR Comments: తెలంగాణకి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుకు తనపై కేసు పెడతారా అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తనపైన ఎన్ని కేసులైనా పెట్టుకోండని, కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు. జైలుకెళ్లేందుకైనా నేను సిద్ధమే అని, జైల్లో పెడితే యోగా చేసి పాదయాత్రకు సిద్ధపడతానని చెప్పారు. రాజ్భవన్లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటవుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ను ఖతం చేసేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు.