KTR Reacts On Farmhouse Issue : ఉస్మాన్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేతలు మంత్రులు, కాంగ్రెస్ నాయకుల నుంచే మొదలు పెట్టాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్ చేశారు. తన పేరు మీద ఎలాంటి ఫాంహాస్ లేదని స్నేహితుడిది లీజుకు తీసుకున్నట్లు తెలిపారు. ఆ ఫాంహౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తానే దగ్గరుండి కూల్చి వేయిస్తానని కేటీఆర్ స్పష్టంచేశారు. మంత్రులు, పెద్దపెద్ద కాంగ్రెస్ నేతలు కట్టిన ఫాంహౌస్‌లు చూపిస్తానని వాటిని కూల్చేస్తారా? అని ప్రశ్నించారు.