KTR on Delimitation Issue : డీలిమిటేషన్‌పై ప్రశ్నించకుంటే తమను చరిత్ర క్షమించదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందన్న విషయమై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీలిమిటేషన్ అంశంపై అన్ని రాష్ట్రాలు ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.