Telangana CM Revanth Reddy on KTR Arrest Issue : తాము కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే కేటీఆర్ ఇప్పటికే చంచల్‌గూడ జైలులో ఉండేవారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీలో ఆయన బడ్జెట్‌పై చర్చకు సమాధానం ఇచ్చారు. అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్ ఎగరవేస్తే రూ.500 జరిమానా విధిస్తారని, డ్రోన్ ఎగరవేశారని ఒక ఎంపీ మీద కేసు పెట్టి చర్లపల్లి జైలులో వేశారని గుర్తు చేశారు. రూ.500 జరిమానా వేసే కేసులో తనను జైలులో పెట్టి వేధించారని ఆరోపించారు. తన బిడ్డ పెళ్లికి కూడా మధ్యంతర బెయిలుపై వచ్చి వెళ్లానని గుర్తు చేసుకున్నారు.