KTR Comments On CM Revanth Reddy : రైతులు అధికారుల వెంబడి కాకుండా కాంగ్రెస్ నేతల వెంట పడాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఓట్లు ఎవరికి వేశామో వాళ్లనే రుణమాఫీ అడుగుదామన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ పలు విమర్శలు గుప్పించారు. షరతులు లేకుండా రూ.2 లక్షల వరకు రుణమాఫీ జరిగేదాక కాంగ్రెస్‌ను వదిలిపెట్టమని స్పష్టం చేశారు.