Raghunandan rao Slams KTR : పురపాలక మంత్రిగా కేటీఆర్ చేసినన్నీ తప్పులు ఎవరూ చేయలేదని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు దుయ్యబట్టారు. చెరువులు ఎక్కడ కబ్జా చేశారో పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్‌కు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఎన్ కన్వెన్షన్‌ను కూలగొట్టాలని 2014లోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన గుర్తుచేశారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎన్ కన్వెన్షన్‌ను ఎందుకు కూలగొట్టలేదని ప్రశ్నించారు.