Harish Rao Comments On CM Revanth : వరద బాధితులకు సాయమందించడానికి చేయడానికి వెళ్తే తమపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బాధితులకు కనీసం అన్నం, నీళ్లు కూడా ఇవ్వలేకపోయారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు రాష్ట్రంలో విద్యార్థుల పాలిట శాపంగా పరిణమించాయని ఆవేదన వ్యక్తం చేశారు.