CM Chandrababu Help to Pregnant in Flood Area in Vijayawada : ఓ వైపు బుడమేరు విజయవాడను అతలాకుతలమైంది. కనుచూపు మేర నీరే. విజయవాడ కండ్రిక వాంబే కాలనీకి చెందిన ఓ మహిళ నిండు గర్భిణి. తక్షణమే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఏం చేయాలో, ఎవరిని సంప్రదించాలో ఆమె కుటుంబ సభ్యులకు అర్థం కావడం లేదు. అప్పుడే ఆపద్భాంధవుడిలా సీఎం చంద్రబాబు అక్కడికి వచ్చారు. ఆమెను ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు.