Heavy Floods in Vijayawada : బుడమేరు వాగు ఉప్పొంగడం ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వరద ప్రవాహంతో విజయవాడ నగరం రెండు రోజులుగా జలదిగ్బంధమైంది. అధికారులు ముందస్తుగా అప్రమత్తమై ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంతో ప్రాణనష్టం సంభవించలేదు. ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సిబ్బంది ద్వారా బాధితులకు ఆహారం, అత్యవసర మందులను పంపిణీ చేస్తున్నారు. పలుచోట్ల సహాయక చర్యల్లో ప్రజాప్రతినిధులు భాగమయ్యారు.