Heavy Rains and Floods in Vijayawada: విజయవాడ నగరాన్ని వరదలు వణికిస్తున్నాయి. 50 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయి వర్షం నమోదు కావడంతో బుడమేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. అకస్మాత్తుగా వచ్చిన వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో నుంచి హైదరాబాద్, కోల్కతా వెళ్లే ప్రధాన రహదారులు పూర్తిగా నీటమునిగాయి. బుడమేరు ఉద్ధృతికి విజయవాడ అతలాకుతలం అవుతుంది.