Heavy Rains in Tirumala : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అదే విధంగా జిల్లాలోని జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. తిరుమలలో భారీ వర్షం కురుస్తుండడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.